కండక్టర్ మృతిపై భగ్గుమన్న కార్మికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండు ప్రవళిక (24) మృతితో ఆర్టీసీలో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి.
- ఖమ్మం రీజియన్వ్యాప్తంగా విధులు బహిష్కరణ, భారీ ర్యాలీలు
- డిపోల్లో నిలిచిపోయిన బస్సులు
- ప్రవళిక చిత్రపటాల వద్ద నివాళి
- మణుగూరులో అంత్యక్రియలు
- 50 లక్షల పరిహారం ఇవ్వాలి: రేగా
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండు ప్రవళిక (24) మృతితో ఆర్టీసీలో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా ఉన్న ఏడు డిపోల పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి, ర్యాలీ తీశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కండక్టర్ ప్రవళికను బస్సులో నుంచి కిందకు తోసేసి ఆమె మృతికి కారణమైన నిందితురాలిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా డిపోల పరిధిలో ప్రవళిక చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందిన కండక్టర్ ప్రవళిక మృతదేహం మణుగూరు డిపోకు చేరుకోగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఆర్ఎం సరిరాం, ఈడీ సోలమన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చర్చికి తరలించారు. మణుగూరు కమలాపురం సమీపంలోని క్రైస్తవ శ్మశానవాటికలో సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

