చట్నీలో ఎలుక.. వడలో ఈగ
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్‌లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఘటన
- విద్యార్థుల ఆందోళన
- కేర్ టేకర్ల తొలిగింపునకు అదనపు కలెక్టర్ ఆదేశాలు
- ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరా
చౌటకూర్, జూలై 9: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్‌లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం పల్లి చట్నీ పాత్రలో ఎలుక సంచరించడాన్ని అక్కడున్నవారు వీడియో తీశారు. మంగళవారం ఉదయమే ఈ వీడియోను పలు సోషల్‌మీడియా గ్రూపుల్లోకి షేర్ చేయగా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ అధికారుల బృందంతోపాటు సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి హుటాహుటినా కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు వేర్వేరుగా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సీఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారుల బృందం కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెస్ కాంట్రాక్టర్‌ను తొలిగిస్తున్నట్టు అక్కడే ప్రకటించారు. తమకు అధ్వానమైన భోజనాన్ని అందిస్తున్నారంటూ జేఎన్టీయూ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మెస్‌లు శుభ్రంగా లేనందున ఎలుకలు, బల్లులు, ఈగలు సంచరిస్తున్నాయని విద్యార్థులు గగ్గోలు పెట్టారు.
మంత్రి రాజనరసింహ ఆరా
ఎలుక సంచారంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశా రు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ ని చెప్పారు. పునరావృతం కాకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

