శ్రీనిత.. తెలంగాణ బిడ్డే

- నాలుగేండ్ల వయస్సులో అరుదైన ప్రపంచ రికార్డు
- 49 సెకన్లలో ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పఠనం
కాటారం, ఆగస్టు 23: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతకు మన శ్రీనిత సరిగ్గా సరిపోతుంది. అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బెంగళూరుకు చెం దిన నాలుగేళ్ల పాపనే శ్రీనిత. ఈ చిన్నారి తెలంగాణ బిడ్డనే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన పులి సత్యనారాయణ, అర్చన దంపతుల కుమార్తెనే శ్రీనిత. ఉద్యోగ రీత్యా బెంగళూరులోని బీహెచ్ఈఎల్లో మేనేజర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు సత్యనారాయణ. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారి గత జూలై 15 మొదట 53 సెకన్లలో ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లను వేగంగా పఠించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అనంతరం తన రికార్డునే తానే బ్రేక్ చేసింది. జూలై 16న 49 సెకన్లలో వాటిని పఠించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నది. అదేరోజు ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్‌ల్లో చోటు సంపాదించింది. ఆ శ్రీనిత తల్లిదండ్రులది స్వగ్రామం కాటారం కావడంతో స్థానికులు సంబురపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

