కోడి ధర కిలో రూ.110!
దేశవ్యాప్తంగా కోళ్ల ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నియంత్రణకు పౌల్ట్రీ రంగ ప్రముఖులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లైవ్ ధర కిలో కనీసం రూ.110 ఉండేలా అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ధరల విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. సోమవారం శంషాబాద్లో పౌల్ట్రీ వ్యాపారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలోని ప్రముఖ పౌల్ట్రీ బ్రీడర్స్ సంఘాల ప్రతినిధులు, పరిశ్రమ ప్రముఖులు పాల్గొని ఏకాభిప్రాయానికి వచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రధానంగా వేధిస్తున్న కోళ్ల దాణా ధరల పెరుగుదలపై సమావేశంలో విసృ్తతంగా చర్చించారు.
- ఏకాభిప్రాయానికి వచ్చిన దేశవ్యాప్త పౌల్ట్రీ సంఘాలు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కోళ్ల ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నియంత్రణకు పౌల్ట్రీ రంగ ప్రముఖులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లైవ్ ధర కిలో కనీసం రూ.110 ఉండేలా అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ధరల విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. సోమవారం శంషాబాద్లో పౌల్ట్రీ వ్యాపారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలోని ప్రముఖ పౌల్ట్రీ బ్రీడర్స్ సంఘాల ప్రతినిధులు, పరిశ్రమ ప్రముఖులు పాల్గొని ఏకాభిప్రాయానికి వచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రధానంగా వేధిస్తున్న కోళ్ల దాణా ధరల పెరుగుదలపై సమావేశంలో విసృ్తతంగా చర్చించారు.
ఫీడ్ తయారీలో కీలకమైన మకజొన్నను జన్యుమార్పిడి(జీఎం) రకాల్లో సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మారెట్లో సోయాబీన్ విస్తారంగా అందుబాటులో ఉన్నందున, పోటీ ధరలకు దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పౌల్ట్రీ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్(ఏఐపీబీఏ), పాన్ ఇండియా బ్రీడర్స్ అసోసియేషన్ (పీఐబీసీసీ), తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (టీపీబీఏ)తోపాటు వివిధ పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

