హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా (Drug mafia) ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకు తిరుగుతున్న టోనీని టాస్క్ఫోర్స్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్న టోనీ.. దేశంలోని ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్వారా హైదరాబాద్లో పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. టోనీతోపాటు తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారుల పోలీసులు అరెస్టు చేశారు.