Pet Insurance | పెంపుడు జంతువులకూ బీమా చేయవచ్చు
పెంపుడు జంతువులను పెంచుకొనే అభిరుచి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వేగంగా పెరుగుతున్నది. భారతదేశంలో ముఖ్యంగా కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. వాటిని కుటుంబసభ్యులుగా చూసుకుంటున్నారు. లక్షలు వెచ్చించి విదేశీ బ్రీడ్ కుక్కలను సాకుతున్నారు. వాటి సంరక్షణ, వైద్యం, ఆహారం కోసం లక్షలు వెచ్చిస్తున్నారు.
- అందుబాటులోకి తెచ్చిన కంపెనీలు
- కుక్క, పిల్లి బీమా ప్రవేశ వయస్సు 3 నెలల నుంచి 7 సంవత్సరాలు
- నిష్క్రమణ వయస్సు 6-10 ఏండ్లు
Pet Insurance | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): పెంపుడు జంతువులను పెంచుకొనే అభిరుచి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వేగంగా పెరుగుతున్నది. భారతదేశంలో ముఖ్యంగా కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. వాటిని కుటుంబసభ్యులుగా చూసుకుంటున్నారు. లక్షలు వెచ్చించి విదేశీ బ్రీడ్ కుక్కలను సాకుతున్నారు. వాటి సంరక్షణ, వైద్యం, ఆహారం కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బీమా కంపెనీలు పెంపుడు జంతువులకు కూడా బీమా కల్పిస్తున్నాయి. అదే పెట్ ఇన్సూరెన్స్. కుక్క ఎవరికైనా హాని కలిగిస్తే పరిహారం, కుక్కను ఎత్తుకెళ్లడం, వైద్య చికిత్స, మరణం వంటి వాటిని కూడా బీమా కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
పెట్ ఇన్సూరెన్స్ అంటే ..
కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్నజాతి పెంపుడు జంతువులకు ఆరోగ్య రక్షణ కల్పించే ప్రత్యేక బీమా. మన కుటుంబసభ్యులకు చేసినట్టే.. పెంపుడు జంతువులకు కూడా బీమా చేయవచ్చు. ఇందులో పెట్స్ చికిత్స ఖర్చులతోపాటు ఇతరాలు కవర్ అవుతాయి.
వాటికి బీమా ఎందుకు అవసరం?
జంతు ప్రేమికులు తమ పెట్స్ కోసం సాలీన పెద్దమొత్తంలో ఖర్చు చేస్తారు. ఇందులో టీకాలు, వైద్య ఖర్చులు, ఇతరాలు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం.. ఒక పెంపుడు కుక్క సంరక్షణ కోసం ఏటా రూ.10 వేల నుంచి రూ.54 వేల ఖర్చు చేస్తారు. జంతు బీమా ద్వారా ఈ ఖర్చులను కవర్ చేయవచ్చు.
నిబంధనలు, షరతులు..
భారతదేశంలో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జంతు బీమాను అందిస్తున్నాయి. బీమా పాలసీకి సంబంధించి ఒక్కో కంపెనీ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. policybazaar. comలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. Bajaj Allianz General Insurance Company Limited పెంపుడు జంతువుల బీమా కుక్క లేదా పిల్లి ప్రవేశ వయస్సు 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు ఉండాలి. నిష్క్రమణ వయస్సు 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండాలి.
ఏయే ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయి?
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కస్టమర్ సపోర్ట్‌తో సంభాషణ ఆధారంగా.. పెట్ ఇన్సూరెన్స్‌లో కుక్క చికిత్స సమయంలో శస్త్రచికిత్స, మరణాల ప్రయోజనం, థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్.. అంటే మీ కుక్క ఎవరికైనా హాని కలిగిస్తే పరిహారం, కుక్కను కోల్పోవడం, దొంగతనం చేయడం వంటివి ఉంటాయి. ఆ సమయంలో పాలసీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరికొన్ని సౌకర్యాలు కావాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ కోసం మీరు ప్రీమియంగా రూ.4 వేలు చెల్లించాలి. డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ పాలసీని రూ.2వేల నుంచి రూ.2,500కి పొందవచ్చు. కుక్కల బీమా కోసం ప్రీమియం వాటి జాతులను బట్టి మారుతూ ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

