హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్లను బుధవారం నుంచి www.telanganaopenschool.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 18 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.