ప్రతి సెంటర్‌కూ అబ్జర్వర్
జాతీయస్థాయి ప్రవేశ, అర్హత పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను మరింత పటిష్టం చేయడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.
- నీట్, జేఈఈ, యూజీసీ నెట్ పరీక్షల కోసం పరిశీలకులు
- ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాప కులు, రిటైర్డ్ అధికారులకు చాన్స్
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి ప్రవేశ, అర్హత పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను మరింత పటిష్టం చేయడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) స్పెషల్ ఫోకస్ పెట్టింది. నీట్-యూజీ, జేఈఈ మెయిన్, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్, సీయూఈటీ తదితర పరీక్షల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక అబ్జర్వర్లను నియమించనున్నది.
ఇందుకోసం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నవారు.. ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించనున్నది. పరీక్ష జరిగే ప్రతి సెంటర్లో సిటీ కో ఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్‌కు అదనంగా ఎన్టీఏ తరఫున స్వతంత్ర అబ్జర్వర్ ఉంటారు. పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల తనిఖీలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల పంపిణీ, ఇతర భద్రతా ఏర్పాట్లు వీరు పరిశీలిస్తారు. ఏవైనా అవకతవకలు గుర్తిస్తే నేరుగా ఎన్టీఏకు నివేదిస్తారు.
మూడు క్యాటగిరీల్లో ఎంపిక
అబ్జర్వర్ల ఎంపికను మూడు క్యాటగిరీలుగా విభజించారు. మొదటి క్యాటగిరీలో ఏడో వేతన సంఘం పే మ్యాట్రిక్స్లో లెవల్-8కు పైన గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ అధికారులుంటారు. రెండో క్యాటగిరీలో సుబేదార్ మేజర్ లేదా అంతకంటే పైస్థాయి రిటైర్డ్ ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) అధికారులు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడో క్యాటగిరీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారు లేదా ఉద్యోగ విరమణ చేసిన వారికి అవకాశం కల్పించారు. ఆసక్తి గల వారు డిసెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ExamObservers
- JEEMain
- neet
- NTA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

