న్యూఢిల్లీ, నవంబర్ 9: 2024లో జరిగే వివిధ వైద్య విద్య పరీక్షల క్యాలెండర్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎమ్ఎస్) గురువారం విడుదల చేసింది. దీనిప్రకారం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ), ఫారిన్ డెంటల్ స్క్రీ నింగ్ టెస్ట్ (బీడీఎస్) జనవరి 20న నిర్వహించనున్నారు.
నీట్ ఎండీఎస్ వచ్చేఫిబ్రవరి 9న, నీట్ పీజీ పరీక్ష మార్చి 3న, ఎఫ్ఎంజీఈ పరీక్షను జూన్ 30న నిర్వహిస్తారు. వివరాలను natboard.edu.inలో పొందుపరిచారు.