హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. జూన్ 1 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు.
సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నవీన్ నికోలస్ జూన్ 2న తిరిగి విధుల్లో చేరుతారు.