Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Hyderabad | హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మయన్మార్‌కు చెందిన మహిళపై ఆమె భర్తతో పాటు మరో ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కంచన్‌బాగ్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన మహిళను బంగ్లాదేశ్‌కు చెందిన ఫయజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరూ హైదరాబాద్‌కు వచ్చి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన ఫయజ్.. తన స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే ఆమెపై భర్తతో పాటు మరో ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలు కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త ఫయజ్తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు