Navy Radar Station | దామగుండంలో నేవీ రాడార్‌స్టేషన్ వద్దు : లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి
Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని సూచించారు.
Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని సూచించారు. రూల్ 377 కింద లోక్‌సభలో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు.
దాంతోపాటు ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటయ్యాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని స్పష్టం చేశారు. పూడురు మండల ప్రజానీకం నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ రూల్ 377 కింద లోక్‌సభలో ప్రత్యేకంగా రంజిత్ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిశీలించి కేంద్ర రక్షణ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. నేవీ రాడార్ స్టేషన్‌ను అక్కడి నుంచి మార్చి వేరే అనువైన ప్రదేశాలని మార్చాలని కోరారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

