Farm House Case | ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు.. విచారణకు రావాలంటూ ఎమ్మెల్సీకి నోటీసులు
ఫామ్ హౌస్‌లో కోడి పందేల వ్యవహారంలో (Farm House Case) ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మాదాపూర్‌లోని ఆయన వివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్: ఫామ్ హౌస్‌లో కోడి పందేల వ్యవహారంలో (Farm House Case) ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మాదాపూర్‌లోని ఆయన వివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఫిబ్రవరి 13న ఆయనకు నోటీసులివ్వగా లాయర్ ద్వారా వివరణ ఇచ్చారు. కాగా, ఫామ్‌హౌస్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఫామ్‌హౌస్ ఘటనతో నాకు సంబంధం లేదు..
కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టంచేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. మొయినాబాద్ మండ లం, తోలట్టలోని తన భూమిలో బుధవారం ఎవరో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న దుష్ప్రచారంపై గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.
‘నేను 2018లో తోలట్ట గ్రామంలో భూమి కొనుగోలు చేశా. ఆ ప్రాపర్టీని నా మేనల్లుడు జ్ఞాన్దేవ్రెడ్డి చూసుకుంటున్నాడు. అందులో ఫార్మ్‌హౌస్ లేదు. తోటలు, పనిచేసేవారికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి. నా ప్రమేయం లేకుండా సదరు తోటను వర్రా రమేశ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తికి జ్ఞాన్దేవ్రెడ్డి కౌలుకు ఇచ్చినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న ఆ తోటను రమేశ్‌కుమార్‌రెడ్డి, ఎం వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు తెలిసింది.
సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిన్ననే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను’ అని పేర్కొన్నారు. ‘మీడియాలో వార్తలు వస్తున్నట్టు ఆ తోటలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను హైదరాబాద్‌లో లేను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు’ అని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

