బండి సంజయ్‌కి జైలు ఖాయం

- ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకోం
- రాష్ర్టానికి ఏం చేస్తారో చెప్పాలి
- ఎమ్మెల్సీ పురాణం సతీశ్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించటానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆరోపించారు. సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన పాదయాత్రకు ప్రజల మద్దతు లేదని, ఈ యాత్రతో బీజేపీకి ఉన్న రెండు సీట్లూ పోతాయని చెప్పారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బండి సంజయ్ జైలుకు పోవుడు ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసి, సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అద్వితీయంగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే తాము ఊరుకోబోమని స్పష్టంచేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో అధికారంలోకి రాలేదని, ఆనాడు టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటం వల్లే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ భయపడిపోయి ప్రధాని మోదీని కలిశారనడం అర్థరహితమని, భయపడే నైజం కేసీఆర్ డిక్షనరీలోనే లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానిని కలిస్తే బీజేపీ రాష్ట్ర నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కేవలం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను విమర్శించటం మాని ఢిల్లీలో తమ గద్దెను కాపాడుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ ఈ రాష్ర్టానికి ఏం చేసింది.. రేపు ఏం చేయబోతున్నదో సంజయ్ పాదయాత్రలో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

