Minister Mallareddy | అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి : మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy | అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి బీఆర్ఎస్ను బలపర్చాలని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. ఘట్కేసర్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు ప్రజలు ఆశించించిన అభివృద్ధి జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ : అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి బీఆర్ఎస్ను బలపర్చాలని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. ఘట్కేసర్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు ప్రజలు ఆశించించిన అభివృద్ధి జరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుక పోతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం అభివృద్ధి జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుర్తుకు వస్తారని తెలిపారు. అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు. మరోసారి అవకాశం కల్పిస్తే ఘట్కేసర్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చూపిస్తానని తెలిపారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ముల్లి పావని యాదవ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

