Minister Indrakaran Reddy | అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు.. కేసీఆర్‌తోనే సాధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister Indrakaran Reddy | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి(Minister Indrakaran Reddy )అన్నారు.
నిర్మల్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి(Minister Indrakaran Reddy )అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ నుంచి మంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ..ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ..అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ మేనిఫెస్టోను వివరిస్తూ..మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ భరోసా పేరుతో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఆలు లేదు చూలు లేదు..కొడుకు పేరు సొమలింగయ్య అన్నట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఆపాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి బంగల్పేట్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

