Minister Gangula | తెలంగాణ సంస్కతి, చరిత్రను చాటేలా బతుకమ్మ గార్డెన్: మంత్రి గంగుల
Minister Gangula | ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా కరీంనగర్ శివారులోని మానేరు నదిలో రివర్ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరీంనగర్: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా కరీంనగర్ శివారులోని మానేరు నదిలో రివర్ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న ఎంఆర్ఎఫ్ (మానేరు రివర్ ఫ్రంట్) చరిత్రలో నిలువనుందని చెప్పారు.
మానేరు జలాశయం స్పిల్‌వే ఎదుట నిర్మించిన తీగల వంతెన వినియోగంలోకి రాగా, రివర్ ఫ్రంట్ పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉజ్వల పార్కు నుంచి తీగల వంతెన వరకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. లోయర్ ప్రామినేటెడ్, అప్పర్ ప్రామినేటెడ్ పనులు, అనంతరం సివిల్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా పెడస్టల్ బ్రిడ్జి, ఈకో మొబిలి కారిడార్, తెలంగాణ సంస్కృతి, పోరాటయోధుల చరిత్రను వివరించేలా బతుకమ్మ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అంతకుముందు రివర్ ఫ్రంట్ వద్ద చేపట్టే నిర్మాణ పనుల గురించి ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బీ గోపి, మేయర్ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, టూరిజం ఎస్ఈ సరిత, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, ఆర్డీవో కే మహేశ్వర్, ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు హర్ష్ గోయల్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

