Telangana Millet Man | తెలంగాణ మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్ కన్నుమూత
Telangana Millet Man | డీడీఎస్ డైరెక్టర్ పీవీ.సతీశ్ ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసి దళిత మహిళలు, పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.
- అనారోగ్యంతో డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ మృతి
- జహీరాబాద్ నియోజకవర్గంలో చిరుధాన్యాల సాగుకు ఎంతో కృషి
- ఏటా పాతపంటల పేరుతో జాతర నిర్వహణ
- దేశ విదేశాల్లో అవగాహన కార్యక్రమాలు
- సంతాపం తెలిపిన మంత్రి హరీశ్‌రావు, ప్రముఖులు
- నేడు అంత్యక్రియలు
Telangana Millet Man | జహీరాబాద్, మార్చి19: డీడీఎస్ డైరెక్టర్ పీవీ.సతీశ్ ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసి దళిత మహిళలు, పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన స్వచ్ఛంద సంస్థలకు రాకముందు దూరదర్శన్‌లో పనిచేశారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో డీడీఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్, రాయికోడ్, మనూరు మండలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించారు.
నిరుపేద మహిళలకు అక్షరాస్యత కలిపించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సంఘాలు ఏర్పాటు చేశారు. ఎకరా, రెండు ఎకరాల వ్యవసాయ భూముల్లో చిరుధాన్యాలు సాగు చేసేందుకు ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాల సాగుకు కృషి చేశారు. ఝరాసంగం మండలంలోని మచునూరు గ్రామంలో పచ్చసాలే ఏర్పాటు చేసి చదువుతో పాటు కులవృతులపై శిక్షణ కలిపించారు. ప్రతి ఏడాది జనవరిలో పాత పంటల జాతర నిర్వహించి, వాటి సాగుపై అవగాహన కలిపించారు. చిరుధాన్యాల సాగుపై దేశ విదేశాల్లో నిర్వహించిన సదస్సుల్లో అవగాహన కల్పించారు. పస్తాపూర్‌లోని డీడీఎస్ కార్యాలయంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సోమవారం నిర్వహించేందుకు డీడీఎస్ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డీడీఎస్ సతీశ్ మృతి బాధాకరం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ.సతీశ్ (77) మృతి బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. సతీశ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన సతీశ్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.
– కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్‌రావు సంతాపం
పేదలకు తీరని లోటు
పేద మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన డీడీఎస్ డైరెక్టర్ సతీశ్ మృతి తీరని లోటని టీఎస్‌ఎంఎస్‌డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
– టీఎస్‌ఎంఎస్‌డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

