హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ వర్సిటీ శుక్రవారం విడుదల చేసింది.
ఎంబీబీఎస్ ఫేజ్-1 కౌన్సెలింగ్‌కు నేటి(శనివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 1 వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాలని సూచించింది. అభ్యర్థులు కౌన్సెలింగ్ నోటిఫికేషన్, సీట్ మ్యాట్రిక్స్‌ను జాగ్రత్తగా చదివిన తర్వాతనే ఆప్షన్లు ఇవ్వాలని పేర్కొన్నది. వివరాలకు https://www. knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.