సెల్ఫోన్లో లగ్గం

- వీడియోకాల్ ద్వారా మంత్రోచ్చారణ
- కరోనా వేళ పురోహితుడి వినూత్న ఆలోచన
- మెదక్ జిల్లాలో ఒక్కటైన కొత్త జంట
పాపన్నపేట, 05 మే: లగ్గం అంటేనే పచ్చని పందిళ్లు, పురోహితుడి వేదమంత్రాలు, చుట్టాల హడావుడి.. పెండ్లి తంతు మొదలైనప్పటి నుంచి ప్రతీ ఘట్టాన్ని చేయించడానికి బ్రాహ్మణులు ఉండాల్సిందే, వేదమంత్రాలు చదవాల్సిందే. కరోనా వేళ ఆ మంత్రాలు చెప్పే పంతుళ్లు వైరస్ బారినపడుతున్నారు. పెండ్లికి వచ్చేవారినుంచి వైరస్ సోకి అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనకు తెరతీశారు పురోహితుడు దిగంబరశర్మ. సాంకేతికతను వినియోగించుకొని ఆన్లైన్ ద్వారా వేదమంత్రాలు చెప్తూ లగ్గం చేయించారు. ఈ పెండ్లి మెదక్ జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లా గిరిజన తండాకు చెందిన మంజులకు టేక్మాల్ మండలం వెంకటాపూర్ పంచాయతీలోని భీమ్లా తండాకు చెందిన మోహన్‌తో ఈ నెల 3న పెండ్లి చేయాలని నిశ్చయించారు. ఈ నెల 2న సోమ్లా తండాలో ఒకరు కరోనాతో మృతిచెందడంతో.. పెండ్లి వేదికను వరుడి గృహానికి మార్చారు. వైరస్ తీవ్రత వేళ పెండ్లి జరిగే స్థలానికి రాలేనని, ఆన్లైన్ ద్వారా జరుపుతామని పురోహితుడు దిగంబరశర్మ తెలిపారు. అందుకు ఇరు కుటుంబసభ్యులు అంగీకరించారు. దిగంబరశర్మ పాపన్నపేటలోని తన స్వగృహంలో నుంచి వీడియో కాల్ద్వారా మంత్రోచ్చారణ చేస్తూ పెండ్లి జరిపించారు. సెల్‌ఫోన్‌ను పందిరిలో మైక్ వద్ద ఉంచగా.. పెండ్లి తంతు యథావిధిగా కొనసాగింది. కరోనా వల్ల ఆగిపోతుందనుకొన్న పెండ్లి సెల్‌ఫోన్ ద్వారా జరగటంతో రెండు కుటుంబాలు ఊపిరి పీల్చుకొన్నాయి.
పౌరోహిత్యంలో తొలిసారి
నా 20 ఏండ్ల పౌరోహిత్యంలో తొలిసారిగా ఆన్లైన్లో పెండ్లి జరిపించడం చాలా తృప్తినిచ్చింది. అసలే కరోనా టైం. పందిరిలో ఉంటే పెండ్లి వారి సందడితోపాటు డప్పుచప్పుల్లు బాజాభజంత్రీలు, మైకు చప్పుడుతో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆన్లైన్ ద్వారా ఆ సమస్యే లేదు. ఇంటివద్ద ప్రశాంతంగా కూర్చొని సెల్ఫోన్లో వీడియోకాల్ ద్వారా పెండ్లి చేశా.
-దిగంబరశర్మ, పురోహితుడు, పాపన్నపేట, మెదక్ జిల్లా
మాంగల్యం తంతునాం.. మమ!
గత ఏడాది పెండ్లి చేసుకొందామనుకొంటే లాక్డౌన్ అడ్డం పడ్డది, కరోనా తగ్గింది కదా అనుకొనేసరికి మూఢాలు వచ్చిపడ్డాయి. అది కూడా పోయి మంచి రోజులు వస్తున్నాయి అని ఆలోచించేలోపే కరోనా మళ్లీ దండెత్తింది. పెండ్లికి ఇన్ని బాధలేంటో అని ఈడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు మదనపడుతున్నారు. ఇక చేసేదేం లేదనుకొని మాంగల్యం తంతునాం.. మమ! అని హంగు, ఆర్భాటాలు లేకుండానే వివాహతంతును ముగించేస్తున్నారు. గుడిలోనో, ఇంటివద్దనో పెండ్లి చేసుకొంటున్నారు. ఆన్లైన్లో ఆశీర్వాదం, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కట్నాలు తీసుకొంటున్నారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

