Mulugu | ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు
Mulugu | ములుగు : ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు.
Mulugu | ములుగు : ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న అనుమానితులు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో పేరూరు ఎస్ఐ తన బృందంతో అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
పోలీసులను చూసిన కొరియర్ల గుంపు తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్‌కు చెందిన మడిని దేవదేవయ్య, పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు. వీరిద్దరు పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చినట్లు నిర్ధారించారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్‌కుమార్, సీపీఎస్ సీఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేరూరు హరీశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

