రేవంత్ కుటుంబానిదే విద్యా వ్యాపారం
విద్యను వ్యాపారం చేయొద్దంటూ ఆదర్శాలు వల్లించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తన కుమార్తె కార్పొరేట్ సూల్ను ఎందుకు నిర్మిస్తున్నారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర సంపద పెరుగలేదని, రేవంత్‌రెడ్డి కుటుంబ సంపద మాత్రమే పెరిగిందని విమర్శించారు.
- గతంలో విద్యను వ్యాపారం చేయొద్దని సీఎం ఉపన్యాసాలు
- ఇప్పుడు కూతురుతోనే కార్పొరేట్ స్కూల్ నిర్మాణం
- బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యను వ్యాపారం చేయొద్దంటూ ఆదర్శాలు వల్లించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తన కుమార్తె కార్పొరేట్ సూల్ను ఎందుకు నిర్మిస్తున్నారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర సంపద పెరుగలేదని, రేవంత్‌రెడ్డి కుటుంబ సంపద మాత్రమే పెరిగిందని విమర్శించారు. సోమవారం ఆయన కొంపల్లిలోని మైండ్వాల్డ్ కార్పొరేట్ స్కూల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కూల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ.50 వేల కోట్ల అవినీతి, అక్రమ సంపాదనలో భాగంగానే మైండ్వాల్డ్ సూల్లో పెట్టుబడులు పెట్టారని దుయ్యబట్టారు.
కొంపల్లిలో ఉన్న ఈ సూల్ను హైదరాబాద్‌లోని కొల్లూరుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.5 లక్షల ఫీజు వసూలు చేస్తూ వారిపై భారం మోపాలని చూస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని సంస్థ రిజిస్టర్డ్ చిరునామాలో నైమిషారెడ్డి, దుంప శిరీష, దుంప బ్రహ్మానందరెడ్డి, బేతి విజయశ్రీ, శిరీష పరంకుశం పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. సూల్లో పెట్టుబడుల మూలాలు, భూమి కొనుగోలు వివరాలు, సంబంధిత సంస్థల ఆర్థిక లావాదేవీలపై పారదర్శకత పాటించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గురుకుల పాఠశాలలను పూర్తిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తమ్ముడు కొండల్‌రెడ్డికి రూ.200 కోట్ల భూమి అప్పగించడం, మరో తమ్ముడు జగదీశ్వర్‌రెడ్డి బోగస్ కంపెనీతో రూ.వెయ్యికోట్ల ఒప్పందం చేసుకోవడం, కొరియా పర్యటనకు వెళ్లి మరీ సతీమణి పేరుతో గీత హ్యుందాయ్ ఐదు షోరూంలు తెరిపించడం, ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోకుండా అల్లుడి మ్యాక్స్ బీఎన్ ఫార్మా, మెడికవర్ దవాఖానను ప్రోత్సహించడం, ఇప్పుడు కూతురు కార్పొరేట్ సూల్ నిర్మించడం ఇవన్నీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండున్నరేండ్లలోనే ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆస్తులు రూ.50 వేల కోట్లకు పెరుగడంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

