హస్తకళలకు ఈ-గోల్కొండ

- హస్తకళా ఉత్పత్తులకు ‘ఈ-గోల్కొండ’
- పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- మన బొమ్మలకు ఈ-మార్కెటే లక్ష్యం
- సునిశిత పరిశీలన కోసం 3డీ సౌకర్యం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తయారవుతున్న హస్తకళాకృతులు, బొమ్మలకు ఈ-మార్కెట్ ప్లేస్‌ను తయారుచేయడమే లక్ష్యంగా ఈ-గోల్కొండ వెబ్ పోర్టల్ తీసుకొచ్చామని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ చేనేత, జౌళిశాఖ ఆధీనంలోని హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గోల్కొండ వెబ్ పోర్టల్‌ను గురువారం ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా మన కళాకృతులను చేర్చేందుకు వీలున్నది. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది ప్రపంచంలో ఎక్కడికైనా పంపేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పోర్టల్ ద్వారా రాష్ట్రంలో తయారవుతున్న అద్భుతమైన సంప్రదాయ కళాకృతులను, చేతి బొమ్మలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వీలుంటుందని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న అనేక ప్రైవేటు ఈ-కామర్స్ వెబ్సైట్ల కంటే అత్యుత్తమ సౌకర్యాలు ఇందులో ఉన్నట్టు తెలిపారు. ఈ-గోల్కొండ పోర్టల్ ద్వారా విక్రయానికి ఉంచిన కళాకృతులను సునిశితంగా పరిశీలించేందుకు 3డీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసేలా వెబ్‌సైట్‌ను రూపొందించామని పేర్కొన్నారు. https://golkondashop.telangana.gov.in/ లింకు ద్వారా ప్రజలు తమకు నచ్చిన కళాకృతులను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్భుత హస్తకళలను కొనసాగించేందుకు టెక్స్టైల్ శాఖ తరఫున అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలతోపాటు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి హస్తకళల అభివృద్ధి సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

