మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 9 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల టీసీ కోసం వచ్చిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించగా.. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి.
ఈ ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు పీయూ పీఆర్వో గాలన్న తెలిపారు.