అల్లం బుచ్చమ్మ అస్తమయం
మంథని రూరల్ : ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టు సోదరుల తల్లి అల్లం బుచ్చమ్మ శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమె మృతిచెందడంతో కుమారులు రాజయ్య, వీరయ్య, నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం స్వగ్రా మం పెద్దపల్లి జిల్లా మంథని మండలంగా జులపల్లి గ్రామంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యా యి.
-
ముగ్గురు యోధులను అందించిన మాతృమూర్తి మృతి బాధాకరం
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి
-
అల్లం సోదరులకు ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ మంథని రూరల్ : ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టు సోదరుల తల్లి అల్లం బుచ్చమ్మ శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమె మృతిచెందడంతో కుమారులు రాజయ్య, వీరయ్య, నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం స్వగ్రా మం పెద్దపల్లి జిల్లా మంథని మండలంగా జులపల్లి గ్రామంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యా యి.
బుచ్చవ్వ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, జర్నలిజం రంగాల్లో తమదైన ముద్ర వేసి, రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ముగ్గురు కుమారులను తెలంగాణకు అందించిన మాతృమూర్తి బుచ్చవ్వ మరణం బాధాకరమని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయి శోకతప్త హృదయులైన అల్లం సోదరులకు, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, కోరుకంటి చందర్, ఏపీఎంసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీయూఎస్ ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, నేత రవి, న్యాయవాది ఇనుముల సతీశ్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు బాలసాని రాజయ్యతోపాటు పలువురు బుచ్చ మ్మ పార్ధివదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఎమ్మె ల్సీ గోరటి వెంకన్న, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చా న్స్‌లర్ గంటా చక్రపాణి, కల్లు గీత కార్పొరే షన్ మాజీ చైర్మన్ రవికుమార్, సీనియర్ ఎడిటర్ శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, కోశాధికారి యోగానంద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నగునూరి శేఖర్, సీనియర్ జర్నలిస్టులు భాసర్, రమేశ్‌బాబు, బుచ్చన్న, లెనిన్, సుధాకర్, లాయక్‌పాషా, ప్రకాశ్, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

