Home
Telangana
Judge Jeevan Kumar Delivered A Verdict Sentencing The Accused To 20 Years Of Rigorous Imprisonment In A Case
పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు
బాలికపై లైంగికదాడి కేసులో మంగళవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్ నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
కాటారం, ఆగస్టు 18 : బాలికపై లైంగికదాడి కేసులో మంగళవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్ నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలో చదువుతున్న ఓ బాలికతో ములుగు జిల్లా మంగపేట మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన ఎలగొండ నవీన్ ఇన్‌స్టా ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
2021 ఏప్రిల్ 3న బాలికను తీసుకెళ్లి ఐదురోజుల పాటు లైంగికదాడి చేశాడు. బాలిక తండ్రి కాటారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌హెచ్‌వో సాంబమూర్తి పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం డీఎస్పీ కిషన్.. నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాడు. నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

