ఆ అధ్యాపకులు అర్హులేనా?

- క్వాలిఫైడ్ అని అఫిడవిట్లు దాఖలుచేయండి
- ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో బోగస్ అధ్యాపకులను నివారించేందుకు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. తమవద్ద పనిచేస్తున్న అధ్యాపకులు అర్హులేనని అఫిడవిట్లు సమర్పించాలని కాలేజీలను ఆదేశించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మినిట్స్‌లో భాగంగా తాము సమర్పించిన వివరాలన్నీ సక్రమేనని ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఫార్మాట్‌ను జతపరిచి కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి ఇటీవలే ఫ్యాకల్టీ సెలెక్షన్స్‌కు జేఎన్టీయూ అధికారులు అవకాశం కల్పించారు. ఏఐసీటీఈ/ పీసీఐ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఫ్యాకల్టీని నియమించుకోవాల్సి ఉండగా, ఇటీవలే ఆ ప్రక్రియను పూర్తిచేశాయి. ఈ నియామకాలకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మినిట్స్ (ఎస్ఈఎం) ఆమోదం తెలిపాల్సి ఉన్నది. ఈ నెల ఏడోతేదీ వరకు కాలేజీల వారీగా ఎస్ఈఎం సమావేశాలు నిర్వహిస్తూ ఆమోదముద్ర వేస్తున్నారు. ఈ సమావేశాలకు ముందే కాలేజీలు అఫిడవిట్లు సమర్పించాలని జేఎన్టీయూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనను కొత్త ఫ్యాకల్టీకే పరిమితం చేయకుండా, పాతవారికి కూడా వర్తింపజేయాలని టెక్నికల్ అండ్ ఫ్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ బాలకృష్ణారెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Engineering Colleges
- JNTU
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajiv Hanumanthu | శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం.. ఐఏఎస్ రాజీవ్ హనుమంతు, కుటుంబసభ్యులకు గాయాలు!
Mahesh Kumar Goud | మహేశ్ ‘బిస్కెట్’కు రాహుల్ చాక్లెట్.. భారత్ సమ్మిట్‌లో ఆసక్తికర సన్నివేశం!
KTR | తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిది.. కేటీఆర్ మండిపాటు
Section 22A | వీడని 22ఏ చిక్కుముడి.. సీఎం హామీ ఇచ్చి రెండు నెలలైనా కదలని సర్కార్.. రైతులు, భూ యజమానుల అవస్థలు
Meenakshi Natarajan | మీనాక్షి ఔట్.. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

