Vijay Kumar | యూకేలో భారత విద్యార్థి దారుణ హత్య..!
Vijay Kumar | యూకే (UK) లో భారత్‌కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్స్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.
Vijay Kumar : యూకే (UK) లో భారత్‌కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్స్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ కేసులో పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయ్ అంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ఉద్యోగం చేసేవాడని, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి జనవరిలో బ్రిటన్‌కు వెళ్లాడని చెప్పారు.
విజయ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీలను సంప్రదించారు. కాగా హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

