రాత్రివేళ రైళ్లలో మొబైల్ చార్జింగ్‌పై నిషేధం
ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చార్జింగ్ పాయింట్లకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే ఒక రైలులో చార్జింగ్ పెట్టిన ఒక పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బోగీ అంతా దట్టమైన పొగలు అలుముకుని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు చార్జింగ్ పాయింట్లకు విద్యుత్తు సరఫరా బంద్: రైల్వే బోర్డు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చార్జింగ్ పాయింట్లకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే ఒక రైలులో చార్జింగ్ పెట్టిన ఒక పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బోగీ అంతా దట్టమైన పొగలు అలుముకుని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోయినప్పటికీ, ఈ తరహా నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని గ్రహించిన రైల్వే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాత్రి చార్జింగ్తోనే అసలు ముప్పు
ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లు, పవర్ బ్యాంకులలో లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగిస్తారు. చార్జింగ్ అవుతున్న సమయంలో ఇవి అధికంగా వేడెకుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలో ఫోన్లను లేదా పవర్ బ్యాంకులను దిండ్లు, బెడ్షీట్లు లేదా బ్యాగుల కింద ఉంచి చార్జింగ్ పెడుతుంటారు. దీనివల్ల వేడి బయటకు వెళ్లక బ్యాటరీలు త్వరగా వేడెకి పేలిపోయే ప్రమాదం ఉంది. రాత్రి 11 గంటలు కాగానే నిబంధనల ప్రకారం చార్జింగ్ స్విచ్‌లను నిలిపివేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు, సూపర్ వైజర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా సిబ్బందిపై చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

