అక్రమ లే అవుట్లను వెంటనే తొలగించాలి : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | అక్రమ లే అవుట్లను వెంటనే తొలగించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు.

నిర్మల్ : నిర్మల్ పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే చెరువు ప్రాంతంలో అక్రమ లే అవుట్ల వల్ల చెరువు నుంచి బయటకు పోలేని పరిస్థితి నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఇబ్రహీం చెరువును పరిశీలించారు.
చెరువు ప్రాంతం కబ్జాకు గురి కావడంతో అలుగు పూర్తిగా ముసుకుపోయింది. దీన్ని పరిశీలించిన మంత్రి..నీటిని బయటకు తరలించేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని, అక్రమ లే అవుట్లను వెంటనే తొలగించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
అనుమతి లేకుండా లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. దివ్యానగర్ లో నీట మునిగి న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను కూడా మంత్రి పరిశీలించారు.
నీటిని బయటకు పంపే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సి పల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి,అధికారులు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

