అరాచక ఎస్సైపై ఏసీబీ వల.. ఓ వ్యక్తికి లాకప్‌లో చిత్రహింసలు
చేతిలో లాఠీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నదనే అధికారంతో ఓ ఎస్సై అరాచకాలకు పాల్పడ్డాడు. సివిల్ తగాదాల్లో తలదూర్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. ఇటీవల లాకప్‌లో ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టా డు. ఈ వేధింపులను భరించలేక ఓ బాధితు డు సీక్రెట్‌గా ఉంగరంలో కెమెరా పెట్టి ఎస్సై బాగోతాన్ని చిత్రీకరించి ఏసీబీకి చేరవేశాడు.
- ఎన్నారై కేసులో ముడుపులు డిమాండ్
- సివిల్ తగాదాల్లో లక్షలు వసూలు
- వేధింపులను చిత్రీకరించిన బాధితుడు
- ఏసీబీకి వీడియో.. రైడ్‌కు స్కెచ్
- పై అధికారి సలహాతో సెలవుల్లో ఎస్సై!
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : చేతిలో లాఠీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నదనే అధికారంతో ఓ ఎస్సై అరాచకాలకు పాల్పడ్డాడు. సివిల్ తగాదాల్లో తలదూర్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. ఇటీవల లాకప్‌లో ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టా డు. ఈ వేధింపులను భరించలేక ఓ బాధితు డు సీక్రెట్‌గా ఉంగరంలో కెమెరా పెట్టి ఎస్సై బాగోతాన్ని చిత్రీకరించి ఏసీబీకి చేరవేశాడు. ఏసీబీ దాడులకు సిద్ధమవుతున్నదనే విషయం తెలిసి సదరు ఎస్సై సెలవుపై వెళ్లినట్టు సమాచారం. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఓ ఫిర్యాదు రావడంతో ఆ ఎస్సై రంగప్రవేశం చేశాడు. కేసు నమోదు చేసి, ఓ వ్యక్తిని రిమాండ్‌కు పంపాడు. అతడి కొడుకులపైనా కేసు పెట్టాడు. వారిలో ఓ కొడుకును లాకప్‌లో వేసి చితకబాదాడు. తండ్రి బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత ఆ కొడుకు ఎస్సై దగ్గరికి వెళ్లా డు. మరోసారి ఇబ్బందులు పెట్టకుండా ఉం డేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మరో కేసులో ఓ ఎన్నారైకి, వారి ఇంట్లో అద్దెకు ఉం టున్న వారితో డబ్బుల విషయంలో వివాదం నెలకొన్నది. ఎన్నారై సమాచారం మేరకు ఎస్సై బృందం ఇరువర్గాలతో మాట్లాడి కిరాయిదారులకు రూపాయి కూడా ముట్టనీయకుండా ఖాళీ చేయించడంతో వారు ప్రత్యేక విభాగం ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వేధింపులపై ఆగ్రహంతో ఉన్న బాధితుల్లో ఒకరు వారం క్రితం ఎస్సైని కలిసి మా ట్లాడగా ‘మళ్లీ లోపలకు తోయిస్తా ఏమనుకుంటున్నావో’ అంటూ బెదిరించినట్టు తెలిసింది. తమపై ఒత్తిడి లేకుండా చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, మరుసటి రోజు డబ్బులు తీసుకుంటుండగా ఆ వ్యక్తి తన ఉంగరంలో కెమెరాతో చిత్రీకరించి ఏసీబీకి అందజేసినట్టు తెలిసింది. విషయం తెలిసి వెంటనే సెలవులో వెళ్లిపోవాలంటూ రెండు రోజుల క్రితం సదరు ఎస్సైకి డివిజన్ అధికారి సూచించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

