CCS CI Sudhakar | ఏసీబీకి చిక్కి సీఐ పరుగోపరుగు!.. చీటింగ్ కేసు నుంచి తప్పించేందుకు 15 లక్షలు డిమాండ్
చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ స్థలంలో గురువారం బాధితుల నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్‌ను అందుకున్న ఇన్స్పెక్టర్..
- 3 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత
- చీటింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు మొత్తం రూ.15 లక్షల లంచం డిమాండ్
- అడ్వాన్స్‌గా 5 లక్షలు తీసుకున్న సీఐ సీసీఎస్‌లో మరో అవినీతి చేప
CCS CI Sudhakar | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ స్థలంలో గురువారం బాధితుల నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్‌ను అందుకున్న ఇన్స్పెక్టర్.. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకొని ఆ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అధికారులు ఛేజ్ చేసి సీఐని పట్టుకున్నారు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు కేసును మరువకముందే, మరో ఇన్స్పెక్టర్ భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం గమనార్హం. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం… ఆర్థిక నేరాల కేసులను దర్యాప్తు చేసే సీసీఎస్‌లోని టీమ్-7 ఇన్స్పెక్టర్గా చామకురి సుధాకర్ ఉన్నాడు. క్రైమ్ నంబర్ 41/2024కు సంబంధించిన చీటింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నాడు. యాప్రాల్‌కు చెందిన వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ వ్యాపార విస్తరణ కోసం తన డూప్లెక్స్ ఇంటిని అమ్మే విషయంలో బోయిన్‌పల్లికి చెందిన మని రంగస్వామి, హేమ సుందర్‌రెడ్డి తనను రూ.1.48 కోట్లు మోసం చేశారంటూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను ఉన్నతాధికారులు సుధాకర్‌కు అప్పగించారు. నిందితుడైన మని రంగస్వామిని ఈ కేసు నుంచి బయట పడేసేందుకు ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్స్‌గా ఇప్పటికే రూ.5 లక్షల లంచం తీసుకున్నాడు. మిగతా సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా రంగస్వామి రూ.3 లక్షల లంచం గురువారం ఇస్తానంటూ సుధాకర్‌కు హామీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూ.3 లక్షల నోట్ల కట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని రంగస్వామి బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. రంగస్వామి ఫోన్ చేయగానే సుధాకర్ అక్కడకు వచ్చి లంచం డబ్బులు ఉన్న బ్యాగ్‌ను తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా ఇన్స్పెక్టర్ను పట్టుకున్నది. అధికారులను వదిలించుకొని ఆ నగదు బ్యాగ్‌ను అక్కడే వదిలేసి సుధాకర్ పరారయ్యాడు. వెంటనే ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీశ్, కానిస్టేబుళ్లు మున్నా, గోవిందనాయక్, హరికాంత్‌రెడ్డి.. సుధాకర్‌ను వెంటపడి ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు ఉన్న బ్యాగ్‌ను రికవరీ చేసి చేతివేళ్లను కెమికల్‌తో పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సుధాకర్‌ను అరెస్టు చేసి, లంచం డబ్బులు రికవరీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

