Voter Slip | ఓటరు స్లిప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
Voter Slip | ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది.
Voter Slip | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. అయినా వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి ఓటరు స్లిప్పులు అందకపోవడంతో వాటిని ఓటర్లే నేరుగా పొందేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
https://electoralsearch.eci.gov.in వెబ్సైట్లో ఓటర్లు తమ వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటరు వివరాలు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలు లభ్యమవుతాయి. ఈ వెబ్సైట్లో ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ లేదా ఓటరు నమోదులో సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ సాయంతో 3 రకాలుగా ఓటరు స్లిప్పును పొందవచ్చు. ఓటు వేయడానికి వెళ్లే ముందు ఆ స్లిప్పుతోపాటు ఓటరు కార్డును తీసుకెళ్లాలి. ఒకవేళ ఓటరు కార్డు లేకుంటే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఎన్ఆర్ఈజీఎస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు తదితర 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా వెంట తీసుకెళ్లి పోలింగ్ అధికారి అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది.
‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌తో ఇలా..
ఓటర్లు తమ వివరాలను తెలుసుకోవడంతోపాటు ఓటరు స్లిప్పును డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను రూపొందించింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని వివరాలు సులభంగా లభ్యమవుతాయి. ఆ యాప్ సాయంతో ఓటరు కార్డుపై ఉండే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయడం లేదా ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఆ ఓటరు వివరాలతోపాటు పోలింగ్ కేంద్రం, సమయం తదితర వివరాలన్నీ పొందవచ్చు.
బీఎల్వోలదే కీలక పాత్ర
ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లదే కీలక పాత్ర. ఓటర్లు తమ వివరాలను మార్చుకోవడంతోపాటు ఓటు నమోదు, తొలగింపునకు రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలను నియమించారు. ఓటరు జాబితాను రూపొందించడం, ఇంటింటికీ తిరిగి ఆ జాబితాను పరిశీలించడం, చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్త వారికి ఓటుహక్కు కల్పించడంతోపాటు స్థానిక ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను తీర్చడం వీరి విధి. బీఎల్వోల ఫోన్ నంబర్లను https://ceotelangana.nic.in/home.html వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆ వెబ్‌సైట్‌లోని ఆఫీసర్ రిటైల్స్‌లో బీఎల్వోపై క్లిక్ చేస్తే జిల్లా, నియోజకవర్గం ఆప్షన్ వివరాలు అడుగుతారు. వాటిని ఎంపిక చేయగానే బీఎల్వో నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌కు ఫోన్‌చేసి ఎవరైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
పాత కార్డు స్థానంలో కొత్త కార్డు
రాష్ట్రంలో పాత ఓటరు కార్డులు ఉన్నవారికి ఎన్నికల సంఘం కొత్త ఓటరు కార్డు నంబర్లను కేటాయించింది. పాత కార్డులో మొత్తం 14 డిజిట్స్ (ఆంగ్ల అక్షరాలు APతోపాటు 12 అంకెలు) ఉంటాయి. వీటి స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఫార్మాట్ ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నంబర్లను ఇచిన ఎన్నికల సంఘం.. ఓటర్లు ఆ నంబర్లను తెలుసుకునేందుకు https://ceotelangana.nic.in/ home.html వెబ్సైట్లో వీలుకల్పించింది. ఈ వెబ్సైట్ ఒపెన్ చేయగానే ‘సెర్చ్ న్యూ ఎపిక్ నంబర్ వీత్ ఓల్డ్ నాన్-స్టాండర్డ్ ఎపిక్ నంబర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో పాత కార్డు ఎపిక్ నంబర్ నమోదు చేస్తే కొత్త కార్డు నంబర్ వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ లక్షల మంది ఓటర్లకు పాత కార్డులు ఉన్నట్టు గుర్తించిన ఎన్నికల అధికారులు.. కొత్త కార్డు నంబర్‌ను తీసుకోవాలని ఆయా ఓటర్లకు సూచించారు. పాత కార్డు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు ఓటు వేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. కానీ, వారి వివరాలు కొత్త కార్డు నంబర్‌తో ఉంటాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

