మనిషి కోతినుంచి వచ్చాడని చెబుతుంటారు. మనుషుల్లాగే కోతులు, చింపాంజీలు తెలివైన జంతువులు. అవి అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. మనుషులకు అత్యాశ ఎక్కువ. ఉన్నదానితో సరిపెట్టుకోం. ఏదైనా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాం. అచ్చం ఇలానే ప్రవర్తించింది ఓ చింపాంజీ. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో ఆకలితో ఉన్న చింపాంజీ నారింజ పండ్లను తీసుకెళ్తున్నది. చేతులనిండా పండ్లే ఉన్నాయి. అవి చాలవన్నట్లు కాళ్లతో నారింజ పండ్లను ఈడ్చుకెళ్తున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘దీనికి అన్నీ మనిషి బుద్ధులే వచ్చాయ్’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 6 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. లక్షకుపైగా లైకులతో ఈ అత్యాశ చింపాంజీ వీడియో దూసుకెళ్తున్నది.
Who can relate? 😅 pic.twitter.com/1dhgO6pUS3
— Buitengebieden (@buitengebieden) July 7, 2022