టీజీపీఎస్సీని సందర్శించిన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయ్‌సిన్హ్ శ్రీకాంత్ రావురాణే బుధవారం సందర్శించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఐఏఎస్(వీఆర్)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షల (సీబీఆర్ టీ) నిర్వహణ, వాటి పద్ధతులు, నియామక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు టీజీపీఎస్సీ ఇటీవల చేపట్టిన విప్లవాత్మక సంసరణలు, నూతన విధానాలపై లోతుగా చర్చించారు.
- గోవా పీఎస్సీ చైర్మన్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయ్‌సిన్హ్ శ్రీకాంత్ రావురాణే బుధవారం సందర్శించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఐఏఎస్(వీఆర్)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షల (సీబీఆర్ టీ) నిర్వహణ, వాటి పద్ధతులు, నియామక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు టీజీపీఎస్సీ ఇటీవల చేపట్టిన విప్లవాత్మక సంసరణలు, నూతన విధానాలపై లోతుగా చర్చించారు. ప్రజా నియామకాల్లో పారదర్శకత పెంచడం, పరీక్షల పరిపాలనను మరింత మెరుగుపరచడం, ఉత్తమ విధానాలు అందిపుచ్చుకోవడంలో సంస్థాగత అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడానికి సమావేశం ఒక వేదికగా నిలిచింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. సమావేశంలో టీజీపీఎస్సీ సభ్యులు సీ చంద్రకాంత్‌రెడ్డి, పీ విశ్వప్రసాద్, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, కమిషన్ కార్యదర్శి హరిత పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

