గజల్సింగర్ హిమజకు వేధింపులు
దివంగత గజల్ రచయిత్రి బైరి ఇందిర కుమార్తె, ప్రముఖ గజల్ సింగర్ హిమజారామం ఉమెన్ కమిషన్ మెట్లు ఎక్కారు. ఏండ్ల తరబడి తన భర్త, ఆమె అన్నదమ్ములు కొనసాగిస్తున్న గృహ హింసను మహిళా కమిషన్ ఎదుట ఏకరువు పెట్టారు.
- భర్త, అన్నదమ్ములపై మహిళాకమిషన్లో ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : దివంగత గజల్ రచయిత్రి బైరి ఇందిర కుమార్తె, ప్రముఖ గజల్ సింగర్ హిమజారామం ఉమెన్ కమిషన్ మెట్లు ఎక్కారు. ఏండ్ల తరబడి తన భర్త, ఆమె అన్నదమ్ములు కొనసాగిస్తున్న గృహ హింసను మహిళా కమిషన్ ఎదుట ఏకరువు పెట్టారు. తన భర్త మేకల శ్రీధర్‌తోపాటు తోడబుట్టిన అన్నయ్యలు ఇందుసాగర్, రఘురాంపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌లో ఫిర్యాదు చేయగా.. కాసోజు శంకరమ్మ ఆ ఫిర్యాదును స్వీకరించి చైర్పర్సన్ నేరెళ్ల శారద దృష్టికి తీసుకెళ్లారు. భర్త శ్రీధర్ మద్యపానానికి బానిసై వ్యాపారాల పేరుతో క్రెడిట్‌కార్డులు, పర్సనల్ లోన్లు, ప్రైవేట్ ఫైనాన్స్ తదితర మార్గాల్లో అప్పులు చేస్తూ తనను, బిడ్డలను అన్యాయం చేశాడని ఆమె వాపోయారు.
రెండున్నరేండ్ల క్రితమే తోడబుట్టిన అన్నలు ఆస్తిలో వాటా ఇవ్వకుండా తన భర్త శ్రీధర్‌తో కలిసి దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. 60 తులాల బంగారం వరకట్నంగా తీసుకున్నారని, తరువాత వ్యాపారాల్లో నష్టం పేరుతో మరో 105 తులాల బంగారం, డబ్బులు కావాలంటూ తనను, తన తల్లి బైరి ఇందిరను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్టు కమిషన్‌కు వివరించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో భర్త ఇంటి నుంచి పలుమార్లు గెంటివేసినట్టు తెలిపారు. చైల్డ్ కస్టడీని పొంది తన ఇద్దరు కుమారులను ఒంటరిగానే పెంచుకుంటున్నా.. ఈర్ష్యతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. భర్త శ్రీధర్, అన్నయ్యలు ఇందుసాగర్, రఘురాం నుంచి తనకు, కొడుకులకు ప్రాణహాని ఉన్నదని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. నిందితులపై ఇప్పటికే అట్రాసిటీ, చీటింగ్ కేసులున్నాయని, హిమజ ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం చేస్తామని కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

