హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): శరీరం కాలడంతో ఏర్పడే అంగ వైకల్యాని (పోస్ట్ బర్న్ డిఫార్మిటీ)కి ఆగస్టు 6వ తేదీ నుంచి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయనున్నామని ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పేర్లను ఆగస్టు 5వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్ నంబర్ 76809 74918 ద్వారా సంప్రదించాలని సూచించారు.