హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ ఎస్జీటీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 22 వరకు www.tsbcstudy circle.cgg.gov.in ద్వారా దరఖాస్తుచేసుకోవాలని చెప్పారు. వివరాలకు 040-24071178, 040-2707792 9లో సంప్రదించాలని తెలిపారు.