మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం
మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు కాజేసి, మోసం చేసిన ఒక బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
- 48.53 లక్షలు వసూలు
- నకిలీ పత్రాలతో వంచన
- జనగామ బీజేపీ నేత అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు కాజేసి, మోసం చేసిన ఒక బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా బీజేపీ నాయకుడు కొత్తపల్లి సతీశ్‌కుమార్ కొంతకాలంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్-కమలానగర్లో నివసిస్తున్నారు. ఆయన 2018లో జనగామ నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన బాధితుడు తన కుమార్తెకు యాజమాన్య కోటాలో మెడికల్ సీటు కోసం సతీశ్‌కుమార్‌ను ఆశ్రయించాడు. బాచుపల్లిలోని ఒక మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని వారి వద్ద నుంచి రూ.48.53 లక్షలు వసూలు చేశాడు. సీటు ఖరారైనట్టు నకిలీ లేఖను సృష్టించి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితుడు ఆ లేఖను కాలేజీకి తీసుకెళ్లడంతో అది నకిలీదని తేలింది. దీంతో తమ డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ బాధితుడు ఒత్తిడి చేయడంతో సతీశ్‌కుమార్ వారికి రెండు చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా నిందితుడికి రిమాండ్ విధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

