దామగుండం అడవిలో కార్చిచ్చు
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం అడవిలో కార్చిచ్చు అంటుకున్నది. వీఎల్ఎఫ్ నావీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు అంటుకున్నట్టు స్థానికులు తెలిపారు.
- రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోనే మంటలు
- వంద ఎకరాల వరకు ఆహుతి?.. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
వికారాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం అడవిలో కార్చిచ్చు అంటుకున్నది. వీఎల్ఎఫ్ నావీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు అంటుకున్నట్టు స్థానికులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి దామగుండం అడవి తగలబడుతుండగా, రాత్రి 7 గంటల సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సుమారు 100 ఎకరాల వరకు దామగుండం అడవి అగ్నికి ఆహూతి అయింది. రాత్రి 10 గంటల సమయంలో దామగుండం అటవీ ప్రాంతానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలార్పుతున్నాయి. మరోవైపు, నావీ రాడార్ కేంద్రం వద్ద పనులు కొనసాగుతున్నాయని, అయినప్పటికీ అక్కడున్నవారు అడవి తగలబడుతున్న సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మధ్యాహ్నం నుంచి అడవిలో కార్చిచ్చు అంటుకున్నప్పటికీ రాత్రి 10 గంటల వరకు అటవీ శాఖ అధికారులతోపాటు ఇతర అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. కార్చిచ్చుపై డీఎఫ్‌వో స్పందిస్తూ.. ఎవరో ఆకతాయిలు చేసిన పని అని, మంటలు అదుపులోనే ఉన్నాయని, అగ్నిమాపక శాఖ మంటలార్పుతున్నారని తెలిపారు. దామగుండం, మోత్కుపల్లి, అనంతగిరి ప్రాంతాల్లో గడ్డి ఎక్కువ పెరుగుతుందని, మానవ తప్పిదాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. మూసీకి పుట్టినిల్లు అయిన దామగుండం అడవిలో నావీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, లక్షల చెట్లు నాశనం అవుతాయని పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో దామగుండం అడవిలో కార్చిచ్చు అంటుకోవడంపై పర్యావరణ ప్రేమికులతోపాటు స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎవరో కావాలనే అడవిని తగలబెట్టినట్టు పూడూర్ గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

