పిండానికి వైరస్ సోకదు

- ప్రసవం తర్వాతే శిశువుకు వైరస్ సోకే అవకాశం
- పాజిటివ్ గర్భిణులకు ముందస్తు ప్రసవాలు
- గైనకాలజిస్టు డాక్టర్ తాటికుంట విజయకృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు కరోనా వైరస్ సోకినా గర్భంలో ఉన్నంత వరకు బిడ్డ క్షేమమే. గర్భంలో ఉన్న పిండానికి తల్లినుంచి వైరస్ సోకదు. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదంటున్నారు వైద్యనిపుణులు. గర్భవతులు వైరస్‌బారిన పడ్డా కడుపులో ఉన్న పిండానికి ఎలాంటి హాని జరగదంటున్నారు. ప్రసవ సమయంలోగాని లేదా ప్రసవం తర్వాత గానీ ఇతర కాంటాక్ట్స్ ద్వారా శిశువుకు వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు గాంధీ దవాఖాన గైనకాలజిస్టు ప్రొఫెసర్ తాటికుంట విజయకృష్ణ స్పష్టం చేశారు. గర్భిణులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉంటుందని, చాలామందిలో లక్షణాలు కనిపించటం లేదని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, రక్తహీనత, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని అన్నారు.
పౌష్టికాహారమే బిడ్డకు రక్ష
‘కరోనా సోకిన గర్భవతులు చాలా జాగ్రతగా ఉండాలి పౌష్టికాహారం అధికంగా తీసుకోవాలి. పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న పిండం బలంగా ఉంటుంది. తల్లి తీసుకున్న పౌష్టికాహారంతోనే ప్రసవం తర్వాత శిశువు ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
సీ-సెక్షన్ల వల్ల అదనపు ఫలితాలుండవు
కరోనా సోకిన గర్భవతులకు సాధారణ ప్రసవం వల్ల కడుపులో బిడ్డకు వైరస్ సోకే అవకాశముందనేది అపోహ మాత్రమేనని విజయకృష్ణ తెలిపారు. ‘సిజేరియన్ వల్ల బిడ్డకు, తల్లికి అదనపు ఫలితాలేవి ఉండవు. అనవసరంగా సిజేరియన్లు చేయవద్దు. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే తప్పా సెక్షన్లు అవసరం లేదు’ అని వివరించారు. పెద్దగా సమస్యలు ఉండకున్నా, ముందస్తు ప్రసవాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

