హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నకిలీ ఔషధాలను నియంత్రించడంలో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) విభా గం చురుగ్గా పనిచేస్తున్నదని ఇంటర్‌పోల్ అధికారులు అభినందించారు. ఈ మేరకు ఇంటర్‌పోల్ నుంచి తెలంగాణ డీసీఏకు మెయిల్ ద్వారా అభినందన లేఖ వచ్చినట్టు సంస్థ డైరెక్టర్ జనరల్ వీ కమలాసన్‌రెడ్డి శనివారం తెలిపారు. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
మలక్‌పేటలో నకిలీ ఫార్మసీ లైసెన్స్
మలక్‌పేట్‌లోని ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్లో ‘ఐశ్వర్య ఫెర్టిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫార్మసీపై డీసీఏ అ ధికారులు దాడులు జరిపారు. ఈ సోదా ల్లో ఆ ఫార్మసీ లైసెన్స్ నకిలీదిగా అధికారులు గుర్తించారు. అందులో విధులు ని ర్వర్తించే ఫార్మాసిస్ట్ వివరాలు కూడా నకిలీవేనని తేల్చి, స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్ లైసెన్స్ లేకుండా ఔషధాల అక్రమ నిల్వలు, విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు.