కరోనాతో మాజీ సీఈ వెంకటాచారి మృతి

జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ):కరోనా బారినపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ ఇంజినీర్ (సీఈ) వీ వెంకటాచారి (92) శనివారం కన్నుమూశారు. అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. దాదాపు 46 ఏండ్లు నీటిపారుదలశాఖలో వివిధహోదాల్లో పనిచేసిన వెంకటాచారి తెలుగుగంగ, పోలవరం వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. నల్లగొండ జిల్లా మంగలిపల్లిలో వెంకటాచారి జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో వెంకటాచారిది ప్రధానపాత్ర. చెన్నారెడ్డి హయాంలో గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై నిపుణుల కమిటీలో ఆయన ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గోదావరి నదీజలాల వినియోగంపై బచావత్ కమిషన్‌లో ఉన్నాయి. ఆ సమయంలో ఏపీలోని మిగులు జలాలను తమిళనాడుకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంకావడంతో ఎన్టీఆర్ హయాంలో ఎక్ప్‌పర్ట్ హోదాలో బచావత్ కమిషన్‌లో వెంకటాచారి వాదనలు వినిపించారు. 1984లో ఎక్స్పర్ట్ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసి అనేక ప్రాజెక్టులకు రూపకల్పనచేశారు. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించి వారి ఉన్నత చదువులకు తోడ్పాటు అందించారు. వెంకటాచారి కుమారుడు కాకతీయ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆప్కాబ్ చైర్మన్‌గా పనిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ce
- corona
- venkata chari
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

