పర్యావరణహితంగా జీహెచ్ఎంసీ

గ్లోబర్ మేయర్ల సదస్సులో గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు 5 మిలియన్ల మొక్కలు నాటడంతోపాటు, 64 వేల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వర్చువల్‌లో జరిగిన గ్లోబల్ మేయర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం, హరిత పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, అవలంబించాల్సిన లక్ష్యాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, లాస్ఏంజెల్స్ మేయర్ ఎరిగ్ గర్సెట్టి ప్రారంభ సందేశం ఇచ్చారు. ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లు పాల్గొన్న ఈ సదస్సులో మన దేశం నుంచి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికే అవకాశం దక్కింది. సమావేశంలో ఆమె మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగాన్ని 15 శాతం తగ్గించేందుకు సంప్రదాయ ఇంధన వనరుల ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సీఎం కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో బహుముఖవ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలకు సహకారమందించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు విజప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

