Power Consumption | రికార్డుస్థాయిలో విద్యుత్తు వినియోగం.. మండే ఎండలతో పెరుగుతున్న డిమాండ్
మండేఎండలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతున్నది. మే నెలలో నమోదయ్యే రికార్డుస్థాయి వాడకం మార్చి నెలలోనే నమోదవడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 289.697 మిలియన్ యూనిట్లకు చేరింది.
- మే నెల రికార్డులు మార్చిలోనే బద్దలు
- హైదరాబాద్‌లోనూ అత్యధిక వాడకం
Power Consumption | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మండేఎండలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతున్నది. మే నెలలో నమోదయ్యే రికార్డుస్థాయి వాడకం మార్చి నెలలోనే నమోదవడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 289.697 మిలియన్ యూనిట్లకు చేరింది. నిరుడు మార్చి చివరి వారంలో నమోదైన రికార్డు ఈ ఏడు మార్చి మొదటి వారంలోనే బద్దలైంది. నిరుడు మార్చి 30న రాష్ట్రంలో 15,497 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 8వ తేదీనే 15,623 మెగావాట్లతో ఆ రికార్డునే అధిగమించింది. ఈ ఏడాది మార్చి 14న 308.54 మిలియన్ యూనిట్లతో అత్యధిక విద్యుత్తు వినియోగం నమోదైంది. ఎండలు మండుతుండటం, వరుసగా సెలవుల కారణంగా అంతా ఇంటిపట్టునే ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం అమాంతం పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లోనే 15 శాతం డొమెస్టిక్ విద్యుత్తు వినియోగం పెరిగింది. గ్రేటర్లో వినియోగదారుల సంఖ్య పెరుగుదలతో విద్యుత్తు డిమాండ్ మరింతగా పెరిగింది.
వ్యవసాయానికీ పెరిగిన డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికీ విద్యుత్తు డిమాండ్ సైతం పెరిగింది. చెరువుల, వాగులు ఎండిపోయాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులంతా బోర్లు, బావుల మీదున్న విద్యుత్తు మోటర్లపై ఆధారపడుతున్నారు. దీంతో వ్యవసాయానికి సరఫరా అవుతున్న విద్యుత్తు 2-5 శాతం పెరిగింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. ఎండలు మరింతగా పెరిగితే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు అందుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విద్యుత్తు డిమాండ్, సరఫరా తీరుపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డుల నమోదు
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డులనే తిరగరాస్తున్నది. నిరుడు మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగంతో రికార్డు నమోదైంది. గత గురువారం ఒక్క గ్రేటర్‌లోనే 79.48 మిలియన్ యూనిట్ల రికార్డుస్థాయి విద్యుత్తు వినియోగం నమోదు కావడం గమనార్హం. నిరుడు మార్చిలో గ్రేటర్ అత్యధిక విద్యుత్తు వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే. మార్చి నెల సరాసరి విద్యుత్తు వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మార్చి వరకు సరాసరి విద్యుత్తు వినియోగం 70.96 మిలియన్ యూనిట్లకు చేరనున్నది. దీంతో దాదాపు 22.7 శాతం పెరుగుదల నమోదైంది. 15 జిల్లాలతో కూడిన టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశీలిస్తే 2023 మార్చి 3న 188.60 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా, ఈ ఏడాది మార్చి 13న గరిష్ఠగా 202.45 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

