Be Careful | పెద్దల నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపం.. అనంతగిరి ఘటనే అందుకు మరో సాక్ష్యం
Be Careful | తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి వాళ్ల ప్రాణాలనే హరిస్తాయి. తాజాగా గత ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
హైదరాబాద్: తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి వాళ్ల ప్రాణాలనే హరిస్తాయి. తాజాగా గత ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. డీజే చప్పుళ్లు, ధూంధాం డ్యాన్సులతో జోరుగా పెళ్లి ఊరేగింపు సాగుతుంటే.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగుతున్న కారు వెనుక సీట్లో కూర్చున్న తొమ్మిదేళ్ల బాలిక ఇంద్రజ ఆ వేడుకలు చూసేందుకు తహతహలాడింది. పెళ్లికూతరుకు చిన్నమ్మ బిడ్డ అయిన ఇంద్రజ అక్కకు తోడుగా పెళ్లికొడుకు ఊరికి వచ్చింది. కొత్త ఊరు కావడంతో కిందకు దిగకుండా కారు డోరులోంచే తల బయటికి పెట్టి కారు ముందు నృత్యాలు చేస్తున్న వారిని చూస్తున్నది.
అది గమనించి కారు డ్రైవర్ శేఖర్ నిర్లక్ష్యంగా వెనుక గ్లాస్ ఎక్కించడంతో బాలిక మెడ డోర్లో ఇరుక్కుపోయింది. చీకటి వేళ కావడం, అందరూ ఊరేగింపుపైనే దృష్టి పెట్టడంతో కారులో ఉన్నవాళ్లు కూడా ఇంద్రజ డోర్లో ఇరుక్కున్న సంగతిని గమనించలేదు. చివరికి కారు బయట ఉన్నవాళ్లు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించడంతో డోర్‌ను కిందకు దించాడు. బాలికను హుటాహుటిన కోదాడ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో అడుగడుగునా పెద్దల నిర్లక్ష్యమే కనిపిస్తున్నది.
బిడ్డను పెళ్లి కూతురుకు తోడుగా కారులో సాగనంపుతున్నప్పుడు తలగానీ, కాళ్లుచేతులుగానీ కారులోంచి బయటపెట్టొద్దని తల్లిదండ్రులు చెప్పి ఉండాల్సింది. తనకు తోడుగా వస్తున్న చిన్నమ్మ బిడ్డ చిన్నపిల్ల కావడంతో పెళ్లికూతురు తన దగ్గరే కూర్చోబెట్టుకున్నా బాగుండేది. ఆ చిన్నారి ఊరేగింపును చూసేందుకు నిక్కినిక్కి తల బయటపెడుతుంటే చూసినవాళ్లు ఎవరైనా ముందే హెచ్చరించినా ఆ ఘోరం జరిగేది కాదేమో. అన్నింటికంటే ముఖ్యంగా కారు డోర్ ఎక్కించేటప్పుడు డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నా పాప ప్రాణాలు దక్కివేమో.
ఒక్క ఇంద్రజ మాత్రమే ఇలాంటి నిర్లక్ష్యాలకు బలి కాలేదు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కారులో ఆడుకుంటుండగా డోర్ లాక్ కావడంతో పిల్లలు ఊపిరాడక ప్రాణాలు విడిచిన ఘటనలు అరుదుగానైనా ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గారాబం కోసం పిల్లలను కారులో ఆటకు వదిలేసి పట్టించుకోకుండా ఇంట్లో కూర్చుంటే ఇలాంటి ఘటనలు నిస్సందేహంగా ఇకపై కూడా పునరావృతమవుతాయి. పిల్లల విషయంలో పెద్దలు నిత్యం అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగకుండా నివారించడం పెద్ద కష్టమేమీ కాదు. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. గారాబంతో, నిర్లక్ష్యంతో మీ బిడ్డను కూడా మరో ఇంద్రజలా మార్చకండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

