DSC | డీఎస్సీ వాయిదా వేయాలంటూ.. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించిన నిరుద్యోగులు
DSC | తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాతపరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు.
DSC | హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాతపరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. దీంతో లక్డీకాపూల్‌లోని ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ.. డీఎస్సీ, గ్రూప్-2కు సంబంధించి ఏది వాయిదా వేయాలో అధికారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అయితే గ్రూప్-2నే వాయిదా పడుతున్నట్లు అధికారులు మీడియాకు లీకులిచ్చారు. డీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ ఎగ్జామ్స్‌ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ రాతపరీక్షలకు స్లాట్లు కూడా ఖరారు కావడంతో డీఎస్సీని వాయిదా వేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్-2నే వాయిదా పడుతుందని కథనాలు వచ్చాయి. అయితే డీఎస్సీ అభ్యర్థులు మాత్రం.. డీఎస్సీనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానితో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా డీఎస్సీ అభ్యర్థులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. దంపతులకు తప్పిన పెను ముప్పు!
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Bigg Boss 10 | మాజీ కంటెస్టెంట్లతో హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు.. ముకేష్‌పై త్రిగుణ్ ఫైర్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

