కూతురి బర్త్‌డే గిఫ్ట్.. నిరుపేదకు ఇల్లు
- ఎన్నారై దంపతుల ఔదార్యం
- రూ.1.97 లక్షలతో ఇంటి నిర్మాణం
ధర్మపురి, మార్చి 14: తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎన్నారై దంపతులు నిరుపేదకు అండగా నిలిచారు. జగిత్యాలకు చెందిన ఎన్నారై దంపతులు ఎలగందుల స్వరాజ్-అశ్విని తమ కూతు రు శ్రీమయి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 6న ఓ పేద కుటుంబానికి ఇంటిని నిర్మించివ్వాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ను సంప్రదించగా, అతను స్థానికురాలు బెల్గం లావణ్య దీనస్థితిని వివరించారు. లావణ్య భర్త అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కూలీ పనిచేస్తూ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నది. వెంటనే స్పందించిన ఎన్నారై దంపతులు.. లావణ్యకు ఉన్న కొద్ది స్థలంలో గత నెలలో రూ.1.97 లక్షలతో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించి, పూర్తి చేశారు. ఆదివారం స్వరాజ్ తల్లిదండ్రులు ఎలగందుల సుధాకర్-పద్మ నూతన గృహాన్ని ప్రారంభించి లావణ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎన్నారై దంపతులు, వారి తల్లిదండ్రులకు లావణ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- birthday gift
- home
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

