హ్యాపీ బర్త్‌డే కేటీఆర్

- ఐటీశాఖ మంత్రికి శుభాకాంక్షల వెల్లువ
- దేశ, విదేశీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల గ్రీటింగ్స్
- అందరికీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సామాన్యుల నుంచి విదేశీ ప్రముఖుల వరకు.. చిరు వ్యాపారులు మొదలుకొని బడా పారిశ్రామికవేత్తల దాకా.. గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ నాయకుల దాకా.. సర్పంచ్ నుంచి మంత్రుల వరకు.. వార్డు నాయకుడి నుంచి జాతీయ నేత వరకు దాదాపు అందరి సోషల్‌మీడియా ఖాతాల్లో ఒకటే మాట.. అదే ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్ సార్’. ఇది ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది. శనివారం మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేటీఆర్ అభిమతానికి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో సేవా కార్యక్రమంతో విషెస్ చెప్పారు. కొందరు ఆకలితో ఉన్నవారికి, అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఇంకొందరు అభాగ్యులకు ఆర్థికంగా అండగా నిలిచారు. మరికొందరు నిరుపేద విద్యార్థుల చదువుకు భరోసా ఇచ్చారు. చాలామంది ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న ఫొటోలతో మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ విజన్ లక్షల మందికి మార్గనిర్దేశం. నా ఒక్కడికే కాదు.. మీ రాష్ట్రం మొత్తానికి మీరు సూపర్‌స్టార్’ అని హీరో సోనూసూద్ ట్వీట్ చేశారు. ‘నాది కర్ణాటక. నేను కేటీఆర్ సర్‌కు వీరాభిమానిని’ అంటూ హులుగప్ప అనే వ్యక్తి ట్విట్టర్లో కేటీఆర్ బర్త్‌డే విషెస్ చెప్పారు. పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌కు వచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మన్, బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫెర్రర్.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రముఖ క్రీడాకారులు, సినీతారలు, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ర్టాల మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, వివిధ రాష్ర్టాల నాయకులు, ఉన్నతాధికారులు తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ, విదేశాల్లో కేటీఆర్ అభిమానులు కేక్ కట్‌చేసి పుట్టినరోజు సంబురాలు చేసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపినవారందరికీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

