వరంగల్ రూరల్ : గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు నుంచి మునిపల్లి గ్రామానికి వెళ్లే దారిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షాకాలంలో నీరు నిలిచి మునిపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రత్యేక చొరవ తీసుకోని మునిపల్లి నుంచి కుడా వెంచర్ మీదుగా ఓఆర్ఆర్ వరకు ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
శుక్రవారం మునిపల్లి నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణి, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, దామెర సాగర్, కూడా, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.